HomeTelugu Trending'చిరంజీవి 156' టైటిల్‌ ఫిక్స్‌

‘చిరంజీవి 156’ టైటిల్‌ ఫిక్స్‌

Chiranjeevi 156 titleటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘మెగా 156’. బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవలే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేశారు.

లాంఛింగ్ వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ సినిమా టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించాడు చిరంజీవి. మెగా 156 చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. చిరంజీవి విశ్వంభర టైటిల్‌ లుక్‌ను ట్వీట్ చేయగా.. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

సినిమా లాంఛింగ్ రోజే మ్యూజిక్‌ సిట్టింగ్‌ పనులు కూడా మొదలయ్యాయని అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ చిత్రంలో చిరంజీవి దేవ, దానవ, పాతాళ, యక్ష, భూ లోకాలన్నీ తిరిగి వస్తాడట. మొత్తం అయిదు లోకాలకు అయిదుగురు హీరోయిన్లను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు అని టాక్‌.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!