HomeTelugu Trendingక్రాక్‌ సినిమాపై చిరంజీవి ప్రశంసలు

క్రాక్‌ సినిమాపై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi about

టాలీవుడ్ మాస్‌మహారాజ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. క్రాక్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లోని హోం థియేటర్ లో వీక్షించాడు. ఈ నేపధ్యంలో చిరంజీవి దర్శకుడు గోపీచంద్ మ‌లినేనికి శుభాకాంక్షలు తెలిపారు. త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. క్రాక్ సినిమాలో ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఒంగోలుతో ఉన్న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నాడు. తాను ఒంగోలులో చ‌దువుతున్న స‌మ‌యంలో వేట‌పాలెం గ్యాంగ్‌, వారి ఆహార‌పు అల‌వాట్లు గురించి గగుర్పొడిచే విష‌యాలు వినేవాడిన‌ని చెప్పారు. రాత్రి పూట క‌రెంట్ క‌ట్ చేసి..హ‌త్య‌లు చేసిన విష‌యాలు ఆ సమ‌యంలో ఉండేవ‌ని చెప్పుకొచ్చాడు.

త‌న అనుభ‌వాల‌ను గోపీచంద్ మ‌లినేనితో పంచుకున్న చిరు..ఆచార్య సెట్స్ కు ఒక‌సారి రావాల‌ని డైరెక్ట‌ర్ గోపీచంద్ ను ఆహ్వానించాడ‌ట‌. చిరు నుంచి ప్ర‌శంస‌ల‌తోపాటు ఆహ్వానం అంద‌డంతో సంతోషంలో మునిగిపోయారు గోపీచంద్ మ‌లినేని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu