బాలకృష్ణను కౌగిలించుకున్న మహిళ అభిమాని ..వీడియో వైరల్‌

స్టార్‌ నటుడు.. తెలుగు దేశం నేత నందమూరి బాలకృష్ణను ఒక మహిళ అభిమాని కౌగిలించుకోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలయ్య ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని సందర్శించారు. అంతేకాదు అక్కడ విఘ్నేశ్వరుడితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆయనకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయంలో వెలుపలికి వస్తున్న సమయంలో బాలకృష్ణను చూడడానికి అభిమానులు పోటెత్తారు. అంతేకాదు తమ అభిమాన నటుడితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒక మహిళ అభిమాని.. హఠాత్తుగా వచ్చి బాలయ్యను కౌగించుకుంది. ఈ పరిణామానికి బాలకృష్ణ షాక్‌కు గురైన ఆ తర్వాత తేరుకున్నారు. ఆతర్వాత బాలయ్య.. అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ టైటిల్‌తో ఒక సినిమా చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి మరోసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates