HomeTelugu Trendingచిన్న అనుమానం ఉండేది.. ఇప్పడు చాలా సంతోషంగా ఉంది: చిరంజీవి

చిన్న అనుమానం ఉండేది.. ఇప్పడు చాలా సంతోషంగా ఉంది: చిరంజీవి

chiranjeevi about natu natu

ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఆస్కార్‌ రావడంతో యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని ఆయన అన్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న విషయంలో రాజమౌళికి పెద్దపీట వేశారు.

చిరంజీవి రాజమౌళి విజన్ మనకు ఇంత గౌరవాన్ని గర్వాన్ని తెచ్చిపెట్టిందని చిరంజీవి పేర్కొన్నారు. అందుకే రాజమౌళికి తన ధన్యవాదాలు చెబుతున్నానని ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు ఆస్కార్ అవార్డుల్లో మా కుటుంబానికి కూడా భాగస్వామ్యం ఉందనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. కీరవాణి, చంద్రబోస్, తారక్, చరణ్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇదొక చారిత్రాత్మకమైన విజయమని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరణ్ గురించి మాట్లాడుతూ… బిడ్డ ఎదుగుతుంటే ఏ తండ్రికైనా ఆనందంగానే ఉంటుందని చెప్పారు.

గతంలో నార్త్ వాళ్లకు తెలుగు సినిమా అనేది తెలియదని… మనల్ని మదరాసీలు అనేవారని… ఆ స్థాయి నుంచి ‘శంకరాభరణం’ తదితర ఎన్నో చిత్రాల ద్వారా మన తెలుగు సినిమా గుర్తింపును తెచ్చుకుంటూ వచ్చిందని అన్నారు. ఆస్కార్ అవార్డు జడ్జ్ మెంట్ చాలా బాగుందని.. నాటునాటుకు అవార్డు వస్తుందని ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ… ఏదో మూల చిన్న అనుమానం ఉండేదని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని… రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధిస్తామని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu