రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!


మాస్ మహారాజా రవితేజ వరుస హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. గత ఏడాది ‘ధమాకా’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ క్రమంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాట్లు వినికిడి.

ఇప్పటికే విడుదల అయిన గ్లింమ్స్ తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. ఈ సినిమాలో హీరో తాను టార్గెట్ చేసినవారిని వరుసగా అంతం చేస్తూ వెళుతుంటాడు. ఆయన చంపే తీరు కూడా రాక్షసంగా ఉంటుంది ఈ సీన్‌ చూస్తుంటే.. రవితేజ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడా అనే అనుమానం కలుగుతుంది.

ఆయన ఎందుకు అలా మారాడనేది సస్పెన్స్. రవితేజను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్స్ గా జయరామ్, మురళీశర్మ కనిపిస్తున్నారు. ‘సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి’ అనే హీరో డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్. ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్,దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రావు రమేశ్, సుశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates