HomeTelugu Newsమెగాస్టార్‌, కొరటాల మూవీ ఆగిపోయిందా..?

మెగాస్టార్‌, కొరటాల మూవీ ఆగిపోయిందా..?

11 12మెగాస్టార్‌ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌ ఎవరో తెలియాల్సి ఉంది.

కాగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పనులు ఆగిపోయాయని ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని కొరటాలను చిరు అడిగినట్లు రాశారు. ఈ వార్తల్ని నిర్మాణ సంస్థలు సోమవారం ఖండించాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీసేందుకు చిరంజీవి, కొరటాల సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి.

చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్‌ ప్రయత్నిస్తోంది. కొరటాలతో మూవీ అనంతరం చిరంజీవి త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu