పవన్ కల్యాణ్ దసరాకు ఫిక్స్ అయ్యాడు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంత కాలం పూర్తవుతున్నా ఇప్పటివరకు టైటిల్ ఏంటనేది అనౌన్స్ చేయలేదు. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న రివీల్ చేస్తారనుకుంటే ఆరోజు కూడా విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ టైటిల్ అనౌన్స్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా తన అభిమానులకు ఈ కానుకను ఇవ్వబోతున్నాడు పవన్.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినిపించాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటినుండి సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతుందో అనే విషయం కొద్ది రోజుల్లో తెలియనుంది. టైటిల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న పవన్ అభిమానులకు ఇది మంచి  విషయమనే చెప్పాలి.