అన్నగారితో ఏఎన్నార్‌ లుక్‌ అదిరింది

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కొత్త ఫోటోను యూనిట్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసింది. అక్కినేని జయంతిని పురస్కరించుకొని ఈ ఉదయం అక్కినేని ఫోటోను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటించగా, అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ తాతను తలపించాడు. ఈ సాయంత్రం మరో కొత్త ఫోటోను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ తో కలిసి ఏఎన్నార్ దమ్ముకొడుతున్న ఫోటోను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు సినిమా రంగంలో ఉండగా ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సరదాగా ఇలా దమ్ముకొట్టేవారు.

బయోపిక్ కావడంతో.. జీవితంలో ఇలాంటి విషయాలను కూడా దాచకూడదనే ఉద్దేశ్యంతో.. వీటిని కూడా సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉండేదో ఈ ఫోటోను చూస్తే అర్ధం అవుతుంది.