HomeTelugu Big Storiesభారతీయ సినిమా గర్వించే క్షణం.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

భారతీయ సినిమా గర్వించే క్షణం.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

chiranjeevi emotional tweet

పాన్‌ ఇండియా స్టార్‌ రామ్‌ చరణ్‌.. పాపులర్‌ అమెరికన్‌ టీవీ షో గుడ్‌ మార్నింగ్ అమెరికాలో సందడి చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎవరికీ రాని అరుదైన అవకాశం రామ్‌ చరణ్‌కి దక్కింది‌. టీవీ షోలో పాల్గొన్న చరణ్‌ పలు ఆసక్తికర అంశలను చర్చించాడు.

ఈ క్రమంలో న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ వీధుల్లో అభిమానులు, ఫాలోవర్లతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగాడు‌. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు  తెచుకున్న చరణ్‌.. వరల్డ్‌వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు.‌

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు, భారతీయ సినిమా గర్వించే క్షణం.. రామ్‌ చరణ్‌ గుడ్‌ మార్నింగ్ అమెరికా షోలో కనిపించడం గొప్ప విషయం. ఒక ఉద్వేగభరితమైన ఆలోచన, శక్తి దార్శనికుడి (ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి)లో పుట్టిన తీరు అద్భుతం.. అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

రామ్‌ చరణ్‌ మరోవైపు ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్ ఈవెంట్‌లో కూడా సందడి చేయబోతున్నాడు. ఈవేడుకలో రామ్ చరణ్ వన్‌ ఆఫ్‌ ది ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. అమెరికన్‌ యాక్టర్లు బ్రండోన్‌ పెరెరా, డేవిడ్‌ డస్ట్‌మాల్చియాన్‌, మేడ్‌లిన్‌ క్లైన్‌, ట్రినిటీ జో-లీ బ్లిస్‌, వయోలెట్ ఎంసీగ్రాతో కలిసి పాపులర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్సులో సందడి చేయబోతున్నాడు.

రామ్‌చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023 ఫైనల్‌ నామినేషన్స్‌ లో ఉత్తమ యాక్షన్‌ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu