సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య తాను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురి చేసింది. తాజాగా శాకుంతంలో ఈవెంట్‌లో స్టేజ్‌పై కంటి తడి పెట్టుకోవడం కూడా వైరల్‌గా మారింది.

Samantha Ruth Prabhu at Pazhani Temple
Samantha Ruth Prabhu at Pazhani Temple

ఇక తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 600 మెట్లు ఎక్కాలి. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు (600)మెట్టు మెట్టుకు హారతి వెలిగించింది సమంత.

అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రమణ్య స్వామికి సామ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.నాగ చైతన్యతో బ్రేకప్ సమయంలో సమంత ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Samantha Ruth Prabhu Palani Murugan Temple
Samantha Ruth Prabhu Palani Murugan Temple

ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న విడుదలకు కానుంది. ఈ సినిమాతో పాటు విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీతో పాటు, హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Samantha’s Shaakuntalam Movie Trailer

Follow Us on FACEBOOK TWITTER

CLICK HERE!! For the aha Latest Updates