చరణ్ తో ఐశ్వర్యారాయ్..?

రామ్ చరణ్, దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు ‘యోధ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అయితే ఈ సినిమా రామ్ చరణ్ తో పాటు అల్లు అరవింద్ కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా మార్కెట్ చేసే ఉద్దేశంలో ఉన్న మణిరత్నం సినిమాలో ముఖ్య పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. గతంలో మణిరత్నం దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన ఐశ్వర్యారాయ్ ఆయన మరోసారి నటించమని అడిగితే కాదనదని నమ్మకం. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితిరావుని ఎంపిక చేసుకున్నారని సమాచారం. 
తమిళ మార్కెట్ లో అడుగుపెట్టడానికి రామ్ చరణ్ కు ఇది మంచి అవకాశమని భావిస్తున్నాడు. అందుకే అభిమానులకు నచ్చినా.. నచ్చకపోయినా.. మణిరత్నంతో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడు. చరణ్-మణిరత్నం కాంబినేషన్ అంటూ ఎన్ని వార్తలు వస్తున్నా.. చరణ్ పిఆర్ టీం ఖండించకపోవడంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.