HomeTelugu Trendingమరోరీమేక్‌తో చిరంజీవి!

మరోరీమేక్‌తో చిరంజీవి!

Chiranjeevi in another rema

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్వీ ప్రసాద్ – ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరంజీవితో పాటు నయనతార .. సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ‘గాడ్ ఫాదర్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 69 కోట్లను వసూలు చేయడం విశేషం.

ఈ నేపథ్యంలో చిరంజీవి మరో మలయాళ సినిమా రీమేక్‌ చేయనున్నట్టుగా సమాచారం. ఆ సినిమా పేరే ‘భీష్మ పర్వం’. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. అక్కడ సక్సెస్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రీమేకులోనే చిరంజీవి హీరోగా నటించినున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu