HomeTelugu Trendingజనసేనకి మద్దతుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేనకి మద్దతుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi interesting com
మెగాస్టార్ చిరంజీవి.. త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి మ‌ద్దతు ఇచ్చే విష‌యంపై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. చిరంజీవి ఈ విష‌య‌మై మీడియాతో మాట్లాడుతూ..తాను జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తానో..? లేదో..? భ‌విష్య‌త్తే నిర్ణ‌యించాల‌న్నారు. నా త‌మ్ముడి, నిబద్ద‌త నాకు తెలుసు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి నిబ‌ద్ద‌త ఉన్న నాయ‌కుడు మ‌న‌కు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే..దానికి నా మ‌ద్ద‌తుంటుందన్నారు. మేమిద్ద‌రం చెరొక వైపు ఉండ‌టం కంటే నేను ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని రాజకీయాల నుంచి వైదొలిగిన‌ట్టు చిరంజీవి తెలిపారు.

2024లో ఏపీలో అధికారంలోకి రావ‌డమే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకెళ్తున్న నేప‌థ్యంలో చాలా రోజుల త‌ర్వాత తాను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భ‌విష్య‌త్‌లో మ‌ద్ద‌తు ఇస్తానేమో.. అంటూ చిరంజీవి మాట్లాడిన మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన గాడ్ ఫాద‌ర్ అక్టోబ‌ర్ 5న (రేపు) విడుద‌ల‌వుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu