నమ్రతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఫొటో షేర్‌ చేసిన మహేశ్‌ బాబు..వైరల్‌

ఈ రోజు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ దంపతుల 14వ పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేశ్‌.. తన ప్రియమైన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘అందమైన జ్ఞాపకాలు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌’ అని మహేశ్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. నమ్రత నవ్వుతుంటే.. మహేశ్‌ ఆమెను చూసి మురిసిపోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను ఇప్పటివరకు రెండు లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ అభిమానులు వారికి శుభాకాంక్షలు‌ తెలుపుతున్నారు.

2000లో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో మహేశ్, నమ్రత జంటగా నటించారు. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత నమ్రత సినిమాలు మానేసి తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు.