HomeTelugu Newsశిరీష్‌ కోసం కథలు ఎంపిక చేస్తున్న చిరు

శిరీష్‌ కోసం కథలు ఎంపిక చేస్తున్న చిరు

9 14
అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అయితే ఒకటి రెండు తప్ప, చెప్పుకోదగిన విజయాలు మాత్రం ఆయన ఖాతాలో నమోదు కాలేదు. దాంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే వున్నాడు. ఇటీవల కథల ఎంపిక విషయంలో సాయిధరమ్ తేజ్ కాస్త గాడి తప్పడంతో, చిరంజీవి ఆయన కెరియర్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. తేజూ సినిమాలకి సంబంధించిన కథలను ముందుగా ఆయన వింటున్నారు.

అలాగే శిరీష్ కెరియర్ కి సంబంధించిన విషయంపై కూడా చిరంజీవి శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. అతని కోసం కొత్తగా ఆయన ఒక కథ విన్నారట. గతంలో కల్యాణ్ దేవ్ హీరోగా చేసిన ‘విజేత’ సినిమాకి దర్శకత్వం వహించిన రాకేశ్ శశి వినిపించిన ఒక కథ చిరంజీవికి బాగా నచ్చిందట. ‘విజేత’ పెద్దగా ఆడనప్పటికీ ఆ దర్శకుడు వినిపించిన కథకి చిరంజీవి ఓకే చెప్పడం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu