రాక్షసుడు డైరెక్టర్‌తో రవితేజ.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!


టాలీవుడ్‌ మస్‌ మహారాజా రవితేజ తాజాగా ‘డిస్కోరాజా’ చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా కూడా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే మన హీరో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ .. రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఈ మధ్య రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ భారీ విజయాన్ని నమోదు చేసింది. తరువాత సినిమాతోనూ హిట్టే కొట్టాలనే ఉద్దేశంతో రమేశ్ వర్మ వున్నాడు. ఈయనకి రవితేజతో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘వీర’ సినిమా చేశారు .. కాకపోతే అది పెద్దగా ఆడలేదు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వాని ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.