HomeTelugu Big Storiesమెగాస్టార్‌ 'లూసిఫర్‌' ప్రారంభం

మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’ ప్రారంభం

Chiranjeevi Lucifer launcమెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ ‘లూసిఫ‌ర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా నేడు పూజాకార్య‌క్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్ర‌సాద్-ఆర్ బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్య‌క్ర‌మంలో నిర్మాత అల్లు అర‌వింద్‌, అశ్వినీ ద‌త్‌, డీవీవీ దాన‌య్య‌, నిరంజన్‌ రెడ్డి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌, నాగ‌బాబు, కొరటాల శివ‌, ర‌చ‌యిత స‌త్యానంద్‌తోపాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఎన్వీ ప్ర‌సాద్ తెలిపారు. మోహ‌న్ రాజా మ‌న నేటివిటికి సరిపోయేవిధంగా క‌థను అద్భుతంగా రాసార‌ని, చిరంజీవి కెరీర్‌లో 153వ చిత్రంగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు బ్లాక్ బాస్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

చిరంజీవి లూసిఫర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిక్స్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu