HomeTelugu Trendingచిరంజీవి లూసిఫర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిక్స్‌

చిరంజీవి లూసిఫర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిక్స్‌

Music director confirmed fo
మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా అనంతరం మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. సత్యదేవ్‌ కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా సంగీతం అందించే అవకాశాన్ని తమన్‌కి వచ్చింది. లూసిఫర్‌కు స్వరాలు సమకూర్చే ఛాన్స్‌ దక్కించుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ‘ప్రతి కంపోజర్‌కు ఇది అతి పెద్ద కల. ఇప్పుడు నా వంతు వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చింది. లూసిఫర్‌ మ్యూజికల్‌ జర్నీ ఇప్పుడు మొదలవుతోంది. మోహన్‌ రాజాకి కృతజ్ఞతలు’ అంటూ తమన్‌ ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu