కాజల్ లెక్కలు!

హీరోయిన్ గా తన హవా అయిపోయిందనుకున్న సమయంలో మెగాస్టార్ 150వ సినిమాలో కథానాయికగా అవకాశం కొట్టేసి షాక్ ఇచ్చింది కాజల్. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన ‘జనతాగ్యారేజ్’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో కూడా మెరిసింది ఈ బ్యూటీ.
దీనికి అమ్మడు డబ్బులు బాగానే డిమాండ్ చేసిందని టాక్. ఈ విషయంపై తాజాగా కాజల్ స్పందిస్తూ.. మొదట్లో పెద్దగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేదాన్ని కాదు.. నిర్మాత ఎంత ఇస్తే అంత తీసుకొని నటించేదాన్ని.. అయితే తర్వాత తర్వాత డబ్బులు విషయంలో కొంచెం తెలివితేటలు పెరిగి నా స్థాయికి అడగడం మొదలు పెట్టానని చెబుతోంది.
 
అంతేకాదు ఏ ఆర్టిస్ట్ కైనా రెమ్యూనరేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుల్లో మన డిమాండ్ తగ్గట్లు డబ్బు ఇస్తున్నారా..?
లేదా..? అనేది చూసుకోవాలై.. అందుకే నేను కూడా లెక్కలు వేసుకొని తీసుకోవడం మొదలుపెట్టాను.
 
సినిమాలో పాత్రతో పాటు రెమ్యూనరేషన్ కూడా నచ్చితేనే నటించేప్పుడు తృప్తిగా ఉంటుంది. ఎంతైనా డిమాండ్
ఉన్నప్పుడే కదా.. నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి.. అంటూ తన అభిప్రాయాలు వెల్లడించింది.