HomeTelugu Trendingడైరెక్టర్‌ బాబీతో చిరు సినిమా!

డైరెక్టర్‌ బాబీతో చిరు సినిమా!

10 20
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ కి ఇది రీమేక్. రామ్‌ చరణ్‌ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించనున్నాడు. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత పాజెక్టు కోసం దర్శకుడు బాబీ .. మెహర్ రమేశ్ పోటీపడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో బాబీకి చిరంజీవి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఈ మధ్య ‘వెంకీమామ’తో బాబీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబీ కథ వినిపించగా, కథలోని కొత్తదనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu