HomeTelugu Trendingహైదరాబాదులో చిరూ '154'మూవీ తాజా షెడ్యూల్ మొదలు

హైదరాబాదులో చిరూ ‘154’మూవీ తాజా షెడ్యూల్ మొదలు

chiranjeevi movie update
మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను ముగింపు దశకి తీసుకొచ్చిన చిరూ.. అంతే స్పీడ్ తో బాబీ సినిమాను కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కెరియర్ పరంగా చిరంజీవికి ఇది ‘154వ చిత్రం’. ఇప్పటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ జరిగింది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది. అందుకు సంబంధించిన ఒక ఫొటో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి .. శృతి హాసన్ కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu