కృష్ణ చేతుల మీదుగా మహేష్ ‘ఏఎంబీ’ సినిమాస్ ప్రారంభం

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అత్యాధునిక హంగులతో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో నిర్మించిన ‘ఏఎంబీ’ సినిమాస్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మహేష్ తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ చేతులమీదుగా మహేష్‌ మల్టీప్లెక్స్‌ వైభవంగా ప్రారంభమైంది. మొత్తం ఏడు స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో 2.ఓ చిత్రం నేడు తొలి సినిమాగా ప్రదర్శితమవుతోంది.

టికెట్‌ ధర రూ. 230 నుంచి ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు టికెట్లు ఇప్పటికే బుక్‌ అయినట్టు తెలిసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఆధునిక వసతులతో కూడిన థియేటర్ మరొకటి లేదని చెబుతున్నారు. ఏఎంబీ సినిమాస్‌లో పడుకుని చిత్రాన్ని చూసే వెసులుబాటు ఉండటం విశేషం.