HomeTelugu Trendingన్యూలుక్‌తో ఫ్యాన్స్‌కి షాకిస్తున్న మెగాస్టార్‌

న్యూలుక్‌తో ఫ్యాన్స్‌కి షాకిస్తున్న మెగాస్టార్‌

Chiranjeevi new look viral
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి న్యూలుక్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా నేపధ్యంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న చిరు… ఎప్పటికప్పుడు అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. ఇటీవలే గెడ్డం, మీసం తీసేసి ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు మరో న్యూ లుక్‌తో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ ఆశ్చర్యపడేలా చేశారు.. క్లీన్ గుండుతో ఉన్న చిరు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

బ్లాక్ గూగుల్స్‌తో కంప్లీట్‌గా నున్నటి గుండుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి.. నేను ఒక‌వేళ స‌న్యాసిలా ఆలోచిస్తే అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ చిరంజీవి న్యూలుక్‌ వెనుక ఉన్న మర్మం ఏంటో తెలియాల్సి ఉంది. ఎదైనా కొత్త ప్రాజెక్టు కోసమే చిరు ఇలా మారిపోయాడా? దాని కోసమే గుండు గీయించారా? అసలు మెగాస్టార్ గుండు వెనుక కథ ఏంటి? అనే గంధరగోళంలో పడ్డారు ఫాన్స్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu