HomeTelugu Trendingఅక్షయ్‌ 'బెల్‌ బాటమ్’ మూవీ టీజర్‌

అక్షయ్‌ ‘బెల్‌ బాటమ్’ మూవీ టీజర్‌

Akshay kumar bell bottom
బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బెల్‌ బాటమ్’‌. రంజిత్‌ ఎమ్‌ తివారి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ రా(ఆర్‌ఏడబ్ల్యూ) ఎజెంట్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్‌ను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నాడు అక్షయ్‌. దీనికి అక్షయ్‌ ‘గో బెల్‌ బాటమ్‌.. త్వరలో 80లోని థ్రిల్లింగ్‌ మీ ముందుకు వస్తుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

ఈ క్రమంలో అక్షయ్ సినిమాకు సంబంధించిన‌ కొత్త పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. ‘ఒంటరిగా మనం చాలా తక్కువ చేస్తాం. అదే ఒక టీంగా కలిస్తే చాలా చేయగలం. మా సినిమా సభ్యులు చాలా కృషి చేశారు. వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు. బెల్‌ బాటమ్‌ కంప్లీటెట్’‌ అంటూ ట్వీట్‌ చేశాడు. యూకే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంబంధించిన పోస్టు ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu