HomeTelugu Trendingనాగార్జున కోసం వంట చేసిన చిరంజీవి.. ఫొటో వైరల్‌‌

నాగార్జున కోసం వంట చేసిన చిరంజీవి.. ఫొటో వైరల్‌‌

Chiranjeevi prepares food n

టాలీవుడ్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి ఫ్రెండ్స్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల మ‌ధ్య కూడా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అంతేకాదు కరోనా తర్వాత వీళ్లిద్దరే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉన్నారు. ఇరు కుటుంబాలలో జరిగే వేడుకలల్లో కూడా వీరు పాల్గొంటారు. వైల్డ్‌డాగ్‌ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉన్న నాగార్జున తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. దీంతో చిరంజీవి అతిథి నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంట చేశాడు. దీనికి సంబంధించి ఫొటో నాగార్జున ట్విటర్‌లో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

‘వైల్డ్‌ డాగ్‌’ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్‌ స్వయంగా వంటచేశారు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు. వైరల్‌ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu