HomeTelugu Trendingబిగ్‌బాస్‌పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

2 6
బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుపోతూ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగిపోయింది తాప్సీ. పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ సొట్టబుగ్గల సుందరి తాజాగా ‘బిగ్‌ బాస్‌’ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాప్సీ నటించిన తాజా చిత్రం ‘థప్పడ్‌’కు సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్యూలో బిగ్‌ బాస్‌ షో గురించి మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు బిగ్‌ బాస్‌ షో అంటే ఎంతో ఆసక్తికరంగా ఉండేది. కానీ రాను రాను ఈ షోలో హింస పెరిగిపోతుంది. దీన్ని కుటుంబంతో కలిసి చూసేలా లేదు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ షోలో హింసలు సృష్టిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి హింసాత్మకమైన షోలను చూస్తూ ఎలా ఎంజాయ్‌ చేయగలుగుతున్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి సంఘటనలను టీవీలో చూసి ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులు అదే తమకు జరిగితే ఇలా ఎంజాయ్ చేస్తారా అని ప్రశ్నించారు. మొత్తానికి బిగ్‌బాస్ షో పై తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారింది. ఆమె నటించిన ‘థప్పడ్‌’ సినిమా ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu