HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాపై చిరంజీవి కామెంట్స్‌.. వైరల్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై చిరంజీవి కామెంట్స్‌.. వైరల్‌

Chiranjeevi reaction on rrr

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై సందడి చేస్తుంది. సూపర్‌ హిట్‌ టాక్‌తో ఏ థియేటర్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ​ నటనకు జనం నీరాజనాలు పడుతున్నారు. దేశం నలువైపుల నుంచి మూవీ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సినీ ప్రేక్షకుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌లో తన రివ్యూను పంచుకున్నారు. ‘మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu