తమిళం మీదే ‘స్పైడర్’ ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నాడు!

‘స్పైడర్’ సినిమా దర్శకనిర్మాతల ఆలోచనలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం నెలల తరబడి అభిమానులు ఎదురుచూసేలా చేశారు. వేసవికి రావాల్సిన ఈ సినిమా కాస్త ఇప్పుడు దసరాకు వస్తుంది. టీజర్ ఓకే అనిపించినా… ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటల్లో కూడా తెలుగు ఫ్లేవర్ కంటే తమిళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో నాన్ మహేష్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ పై బాగా కామెంట్స్ చేస్తున్నారు. తమిళ పాటని తెలుగులో డబ్బింగ్ చేసే సౌండింగ్ మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు.

ఇవి సరిపోవు అన్నట్లు ఇప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్ ను తమిళనాడుకి షిఫ్ట్ చేశారు. అక్కడ తమిళ పాటలతో పాటు తెలుగు పాటలను కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు తమిళ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారనే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మహేష్ తెలుగు మీద కంటే తమిళం మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది.