HomeTelugu Big Storiesఇండస్ట్రీకి పెద్దగా ఉండటం నాకు ఇష్టం లేదు: చిరంజీవి

ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం నాకు ఇష్టం లేదు: చిరంజీవి

chiranajeevi
టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆ హోదా తనకిష్టం లేదని తెలిపారు. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమ లోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ సందర్భంగా సినీ కార్మికులు మాట్లాడుతూ.. ‘గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది’ అని చిరంజీవిని కోరారు.

కాగా, దానిపై స్పందించిన చిరు.. ‌’పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్లు మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయతీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం నిలబడతా’ అని వ్యాఖ్యలు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu