ఆ వార్తపై మెగామేనల్లుడు క్లారిటీ ఇచ్చేశాడు!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా తేజు, వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన తేజు అలాంటి ప్రాజెక్ట్ ఏది చేయట్లేదని కన్ఫర్మ్ చేశాడు. ఖైదీ 150 తరువాత వినాయక్ చేయబోయే సినిమాలో హీరోగా సాయి ధరం తేజ్ ను ఎన్నుకున్నారని అన్నారు.

దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని అన్నారు. కానీ దీనిపై అటు హీరో గానీ, వినాయక్ గానీ ఏది ప్రకటించలేదు. ఎట్టకేలకు తేజు ఈ విషయంపై స్పందించాడు. వినాయక్ గారిని రెండు, మూడు సార్లు కలిసిన మాట వాస్తవమే కానీ అది సినిమా కోసం కాదు. మా కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రావడం లేదు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమా మాత్రమే చేస్తున్నాను. భవిష్యత్తులో వినాయక్ గారితో కలిసి పని చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ వెల్లడించారు.