HomeTelugu Trending'రంగమార్తాండ'కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

‘రంగమార్తాండ’కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

Chiranjeevi's voice over for Ranga Marthanda

డైరెక్టర్‌ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాకి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నం కృష్ణవంశీ ఓ ట్వీట్‌ చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆస్కారముంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu