HomeTelugu Big Storiesఒకే ఫ్రేంలో.. గాడ్‌ ఫాదర్‌- భీమ్లా నాయక్‌.. వైరల్‌

ఒకే ఫ్రేంలో.. గాడ్‌ ఫాదర్‌- భీమ్లా నాయక్‌.. వైరల్‌

Chiranjeevi wishes to bheem

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌ మూవీ భీమ్లా నాయక్‌ రేపు (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు చిరు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒకే సెట్లో గాడ్‌ ఫాదర్‌, భీమ్లా నాయక్‌లు ఉన్న సినిమాటిక్‌ వీడియోను ఆయన షేర్‌ చేశారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రం గాడ్‌ ఫాదర్‌.

ఇటీవల భీమ్లా నాయక్‌, గాడ్‌ ఫాదర్‌ సినిమాల షూటింగ్‌ ఒకే చోట జరగడంతో ఈ సందర్భంగా చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్‌ మూవీ సెట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా రానా, పవన్‌ కల్యాణ్‌, సాగర్‌ కే చంద్ర, త్రివిక్రమ్‌లతో ఫొటోలు కూడా దిగారు. అలాగే భీమ్లా నాయక్‌ టీం కూడా తాజాగా గాడ్‌ ఫాదర్‌ సెట్‌లో సందడి చేశారు. రానా, త్రివిక్రమ్‌, పనన్‌ కల్యాణ్‌, సాగర్‌ కే చంద్ర గాడ్‌ ఫాదర్‌ మూవీ సెట్‌కు వచ్చిన కాసేపు చిరంజీవితో ముచ్చటించారు.

ఈ రెండు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలు, ఫొటోలను సినిమాటిక్‌గా వీడియో క్రియేట్‌ చేసి రామ్‌ చరణ్‌ ఇదివరకే షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవి ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. రేపు విడుదల కానున్న భీమ్లా నాయక్‌ టీంకు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ మెగా హీరోలను ఒకే ఫ్రేంలో చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu