ప్రభాస్ కు ఆ రేంజ్ లో అందిందా..?

బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఐదేళ్ళ పాటు మరో సినిమా ప్రస్తావన లేకుండా బాహుబలి కోసం కష్టపడ్డాడు. ఈ ఐదేళ్ళల్లో ఆయన కనీసం ఏడెనిమిది సినిమాలు చేసేవాడు. బాగానే సంపాదించుకునేవాడు కూడా. కానీ బాహుబలి కోసమే తన సమయాన్ని వెచ్చించిన ఈ హీరో గారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందా అంటే ఆయన ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాన్నే దక్కించుకున్నారని తెలుస్తోంది.

రెండు భాగాలకు గానూ ప్రభాస్ కు దాదాపు 75 కోట్ల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అప్పటివరకు సినిమాకు 5 కోట్ల పారితోషికం తీసుకునే ప్రభాస్ కు బాహుబలితో ఒకవైపు క్రేజ్ మరోవైపు రెమ్యూనరేషన్ రెండూ కూడా ఓ రేంజ్ లో వచ్చి పడ్డాయి. ఈ సినిమా తరువాత ఆయన చేయబోయే తదుపరి సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు.