HomeTelugu Trendingఉస్తాద్‌: చుక్కల్లోంచి సాంగ్‌ విడుదల

ఉస్తాద్‌: చుక్కల్లోంచి సాంగ్‌ విడుదల

Chukkalonchi Lyric Video fr
సింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్’. వారాహి చలన చిత్ర బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ను .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా అలరించనుంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మూవీ యూనిట్‌.

దీనిలో భాగంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. “చుక్కల్లోంచి తొంగిచూసే చక్కానైనా జాబిల్లీ, పక్కాకొచ్చి కూర్చున్నాది అయ్ బాబోయ్ ఏం చేయాలి” అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. హీరోతో కలిసి హీరోయిన్ ట్రావెల్ చేసే సందర్భంలో వచ్చే పాట ఇది.

అకీవా స్వరపరిచిన ఈ పాటకి రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. సింహా ఇంతవరకూ మూడు నాలుగు సినిమాలు చేశాడు. సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్న సింహా-కావ్య ఈ సినిమాపై హోప్స్‌ పెట్టుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu