మహేష్‌ బాబు సినిమా నుండి బయటికొచ్చేసిన ప్రముఖ నటుడు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న’సరిలేరు నీకెవ్వరు’ సినమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పలువురు స్టార్ నటీ నటుల్ని తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వీరిలో జగపతిబాబు సినిమా నుండి బయటికొచ్చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఆయన సినిమా నుండి వెళ్లిపోవడానికి గల కారణాలు ఏమిటనేది మాత్రం తెలియరాలేదు. ఈయన స్థానంలో మరొక నటుడు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారట. ప్రస్తుతం కాశ్మీర్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదలచేయాలని చూస్తున్నారు నిర్మాతలు.