HomeTelugu Newsచిక్కుల్లో పడ్డ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌.. వైరల్‌ అయిన ట్వీట్‌..!

చిక్కుల్లో పడ్డ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌.. వైరల్‌ అయిన ట్వీట్‌..!

పలు అద్భుత చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన టాప్‌ కెమెరామేన్‌ సంతోష్‌ శివన్‌ వివాదాంలో చిక్కుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్నాడు. సంతోష్‌ తో సినిమా చేయాలనీ ప్రతి దర్శకుడు అనుకుంటాడు. టెక్నాలజీని వినియోగించుకొని ఫొటోగ్రఫీ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి సినిమాటోగ్రాఫర్ ఇటీవలే ట్విట్టర్ లో ఓ చిన్న ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కారణంగా చిక్కుల్లో పడ్డారు.

2 21

నిర్మాతలు టెక్నిషియన్స్ విషయంలో ఎలా ఉంటారు, హీరోయిన్స్ విషయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని మెమో రూపంలో పోస్ట్ చేశారు. టెక్నిషియన్స్ కు రెమ్యునరేషన్ చెల్లించే సమయంలో కుక్క కోపంగా ఉన్న ఫోటోను, అలాగే హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ చెల్లించే సమయంలో కుక్క నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇలా పోస్ట్ చేసిన కొద్దీ సేపటి తరువాత వెంటనే దానిని తొలగించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన నిర్మాతలు ఆయనపై మండిపడుతున్నారు. నిర్మాతల మండలిలో సంతోష్ శివన్ పై ఫిర్యాదు చేశారు. సంతోష్ శివన్ ను బ్యాన్ చేయాలని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం దీనిని మొదటి తప్పుగా భావించి హెచ్చరించి వదిలేయాలని అంటున్నారు. ఈ రోజు (బుధవారం) సమావేశం కానున్న నిర్మాతల మండలి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu