HomeTelugu Trending'టైగర్‌ నాగేశ్వరరావు' రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌

‘టైగర్‌ నాగేశ్వరరావు’ రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌

clarity on Tiger Nageswara
టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. 70వ దశకంలో స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించిన కథ ఇది. ఆయనలోని మంచితనం అనే మరో కోణాన్ని కూడా ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదంటూ ఒకటి రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పందిస్తూ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది.

ముందుగా చెప్పిన ప్రకారమే తమ సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నామనీ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఈ సినిమా టీమ్ చెప్పింది. ఈ సినిమాతో నుపుర్ సనన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది.

20230801fr64c8f31c6c09a

Recent Articles English

Gallery

Recent Articles Telugu