HomeTelugu Trendingప్రకాశ్‌రాజ్‌ గెలవాలి: పూనమ్‌ కౌర్‌

ప్రకాశ్‌రాజ్‌ గెలవాలి: పూనమ్‌ కౌర్‌

Poonam kaur about prakash r
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు’ అని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ‘శౌర్యం’, ‘గణేష్‌’, ‘గగనం’, ‘శ్రీనివాస కల్యాణం’ సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్‌-పూనమ్‌ కలిసి ‘గగనం’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu