HomeTelugu Trending'కోబ్రా' తెలుగు ట్రైలర్‌

‘కోబ్రా’ తెలుగు ట్రైలర్‌

Cobra Telugu Trailer
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్- అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న తమిళ ట్రైలర్ ను విడదుల చేసిన ఈ సినిమా టీమ్, ఈ రోజున తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్‌.

బయటికి ఓ సాధారణ మ్యాథ్స్ టీచర్ గా కనిపిస్తూ, ‘కోబ్రా’ తన పనులను చక్కబెడుతూ ఉంటాడనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. డిఫరెంట్ గెటప్స్ తో విక్రమ్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. ఏఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu