HomeTelugu Trending'కరణం మల్లేశ్వరి'గా తాప్సీ..!

‘కరణం మల్లేశ్వరి’గా తాప్సీ..!

6 2
మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన ‘కరణం మల్లేశ్వరి’ జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ యూనిట్. కాగా ‘కరణం మల్లీశ్వరి’ పాత్రలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలనే వేటలో పడ్డారు. ఈ క్రమంలో ముందుగా నిత్య మీనన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తాప్సిని తీసుకోవాలని ఫైనల్ అయ్యారట.

ఈ మేరకు తాప్సితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. తాప్సి కూడా ఈ బయోపిక్ చేసేందుకు ఆసక్తి చూపించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్ సాదించేందుకు పడిన తపన, ఆమె కృషిని ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపనున్నారట. అన్నీ కుదిరితే అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట యూనిట్‌. మరికొద్ది రోజుల్లో నటీనటుల వివరాలు ప్రకటించనున్నారని తెలిసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu