HomeTelugu Big Storiesసెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న కలర్స్ స్వాతి

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న కలర్స్ స్వాతి

Colors Swathi Idiots Movie First Look Poster Out

కలర్స్‌ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరియర్‌ స్టార్ట్‌ చేసి హీరోయిన్‌గా ఎదిగిన ఆమె అష్టాచమ్మాలో మహేశ్‌.. మహేశ్‌ అంటూ ప్రేక్షకులను అలరించింది. ఎప్పుడు తన చలాకీ మాటలతో . క్యూట్ లుక్స్ తో తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణను పొందిన స్వాతిపొందిన స్వాతి 2018లో పైలట్‌ వికాస్‌ వాసును వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇండోనేషియాకు మకాం మార్చిన ఆమె అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. పెళ్లి అనంతరం కాస్త బొద్దుగా మారిన స్వాతి సినీ కేరీర్‌ ముగిసినట్లేనని అందరూ భావించారు.అయితే వాటన్నింటికి చెక్‌ పెడుతూ స్వాతి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

సాక్ష్యం, గూఢ‌చారి లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ కొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించింది. ఈ బ్యాన‌ర్ లో తెరకెక్కుతోన్న తాజా తెలుగు సినిమా ఇడియ‌ట్స్. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాతో క్యూట్ స్టార్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.చాలా కాలం తర్వాత స్వాతిని ఇలా చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఇక తిరిగి సినిమాల్లో నటిస్తుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu