HomeTelugu Trendingహీరోగా రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ కమెడియన్‌!

హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ కమెడియన్‌!

Comedian sunil re entry her

టాలీవుడ్‌ లో సునీల్‌ తన కామెడీ టైమింగ్స్‌తో స్టార్‌ కమెడియన్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే సునీల్‌ హీరోగా రూటు మార్చారు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మర్యాద రామన్నవంటి హిట్‌ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో హీరోగా కాస్త బ్రేక్‌ ఇచ్చి క‌ల‌ర్ ఫొటో, పుష్ప సినిమాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ పాత్రలతో అందరినీ మెస్మరైజ్‌ చేశాడు.

త్వరలోనే ఎప్‌-3 సినిమాతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఓ మంచి ప్రాజెక్టుతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సునీల్‌ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu