ట్రెండ్ అవుతున్న సుహానా తాజా వీడియో

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్‌ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. తాజాగా సుహానా అదిరే స్టెప్పులు వేసిన షార్ట్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. హాలీవుడ్‌ స్టార్‌ విల్‌స్మిత్‌ నటించిన ద ఫ్రెష్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బెల్‌ ఎయిర్‌ థీమ్‌ సాంగ్‌కు షారుఖ్‌ కూతురు స్టైలిష్‌గా స్టెప్పులు వేసింది. త్వరలోనే హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలనుకుంటున్న ఈ స్టార్‌ కిడ్‌ సుహానా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో చదువుతోంది. చదువు ముగిసిన తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసే అవకాశముంది.