HomeTelugu Trendingప్రముఖ హాస్య నటుడు వడివేలుకి మాతృవియోగం

ప్రముఖ హాస్య నటుడు వడివేలుకి మాతృవియోగం

comedian vadivelu mother pa
ప్రముఖ హాస్య నటుడు వడివేలు తల్లి పాప (87) కన్నుమూశారు. మధురైలోని విరగనూర్‌ గ్రామంలో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఆమెను బుధవారం రాత్రి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. వడివేలు తల్లి అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి.

వడివేలు తల్లి మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం తెలియజేశారు. వడివేలు గతేడాది నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్ సినిమాలో మెరిశారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ డైరెక్షన్‌లో నటిస్తోన్న మామానన్‌ విడుదల కావాల్సి ఉంది. దీంతోపాటు రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘చంద్రముఖి2’లో కీ రోల్‌ చేస్తున్నాడు.

డబ్బింగ్‌ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు వడివేలు. ఆయన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu