కామెడీ చేయడం చాలా కష్టం!

ఎం.ఆర్‌.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శైలేష్‌ బొలిశెట్టి, దీక్షాపంత్‌, అంగనా రాయ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘చల్‌ చల్‌ గుర్రం’. మోహన ప్రసాద్‌ దర్శకత్వంలో రాఘవయ్య నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శైలేష్ విలేకర్లతో ముచ్చటించారు.
”ఈ సినిమాలో నా పాత్రా పేరు మనోహర్. ఒకే బిల్డింగ్ లో ఉండే రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని చేస్తూ.. ఆ విషయం ఆఫీస్ లో వాళ్లకు తెలియకుండా మ్యానేజ్ చేస్తూ ఉంటాడు. అందులో నుండి పుట్టుకొచ్చే కామెడీనే ఈ సినిమా. చిత్ర నిర్మాత రాఘవయ్య గారి సహకారంలో ఈ సినిమాలో కొన్ని పాటలను, సన్నివేశాలను పవన్ కళ్యాణ్ గారికి చూపించాం. ఆయన బావున్నాయని మెచ్చుకున్నారు. నిజానికి నాకు సినిమాలోకి రావాలనే ఆసక్తి లేదు. అనుకోకుండా జరిగిపోయింది. కార్ రేసింగ్ లో నేను ఇంటర్నేషనల్ చాంపియన్. అటువైపే అడుగులు వేయాలనుకున్నాను. అయితే కెమెరా ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలోనే నాకు ముకుంద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత సొంత బిజినెస్ చూసుకోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాను. ఈ సినిమా కథ నచ్చి హీరోగా నటించాను. కామెడీ చేయడం చాలా కష్టం.. అంతకంటే డాన్స్ చేయడం ఇంకా కష్టం. రఘు మాస్టర్ దగ్గర కష్టపడి స్టెప్స్ నేర్చుకున్నాను. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాటలు. ప్రతి పాట ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో
ఉన్నాయి. నెగెటివ్ రోల్ లో నటించమని అడుగుతున్నారు. ఇంకా ఏది డిసైడ్ కాలేదు” అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates