HomeTelugu Trending'కనెక్ట్' మూవీ టీజర్‌

‘కనెక్ట్’ మూవీ టీజర్‌

Connect movie Teaser
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నహారర్ థ్రిల్లర్ మూవీ ‘కనెక్ట్’. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. అలా నాయిక ఒక ఆత్మను పిలిస్తే మరో ఆత్మ వస్తుంది. ఆ తరువాత నుంచి చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే కథ.

టీజర్ తరువాత సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయమనే అనిపిస్తోంది. నయనతార సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను, ఇక్కడ యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu