Homeపొలిటికల్జగన్ రెడ్డి హత్యకు కుట్ర.. ఇది కదా కామెడీ అంటే.. ?

జగన్ రెడ్డి హత్యకు కుట్ర.. ఇది కదా కామెడీ అంటే.. ?

Conspiracy to kill Jagan Reddy.. Isnt this a comedy..

గత ఎన్నికల్లో గెలవక ముందు జగన్ రెడ్డి వేరు, ఆంధ్ర సీఎం అయ్యాక జగన్ రెడ్డి వేరు. ఒకప్పుడు జగన్ రెడ్డి ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే వాడు. అప్పటికే లక్ష కోట్లు అవినీతి చేశాడని జగన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. అయినా, జగన్ రెడ్డి ఎన్నడూ ప్రజలకు దూరంగా లేడు. కానీ, సీఎం అయ్యాక తనదైన పాలనను మొదలు పెట్టాక మాత్రం, ప్రజలను నేరుగా కలవడానికి కూడా జగన్ రెడ్డి భయపడుతున్నాడు. లక్ష కోట్లు కాజేశాడు అని అన్నప్పుడే జగన్ రెడ్డికి అది పెద్దగా తప్పు అనిపించలేదు. కానీ, తన పాలన దెబ్బకు ప్రజలు పడే ఇబ్బందులను చూసి మాత్రం జగన్ రెడ్డి భయపడుతున్నాడు. అంటే.. లక్ష కోట్లు కాజేయడం కంటే.. తన పాలన అతి పెద్ద తప్పు అని జగన్ రెడ్డి మానసికంగా అంగీకరించినట్టే కదా. అందుకే కాబోలు, జగన్ రెడ్డి తన భద్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే, జగన్ తన పాలనలో తానే భయపడుతున్నాడు అంటే.. చెప్పుకోవడానికి బాగోదు కదా. అందుకే వైసీపీ మీడియా ఈ వ్యవహారాన్ని మరోలా ప్రమోట్ చేస్తోంది. జగన్ రెడ్డి ఎంతో మందితో పోరాడుతున్నారట. వారంతా జగన్ రెడ్డిని ఏదో విధంగా అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నారట. వినడానికి కామెడీగా ఉంది కదూ. ఒక ఎంపీని అర్ధరాత్రి అరెస్ట్ చేసి అతి దారుణంగా కొట్టించాడు. నోరు ఎత్తిన ప్రతిపక్ష నాయకులను చాలా హీనంగా పోలీసుల చేత దాడి చేయించాడు. అంతేనా.. ? చివరకు జనసేన సభకు సహకరించారు అని ప్రజల ఇళ్లను కూడా కూల్చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. లెక్కకు మించి జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయి. నేడు ఆంధ్ర రాష్ట్రంలో యువత జీవితాలు ట్రాక్ తప్పడానికి ఈ జగన్ రెడ్డి కారణం కాదా ?.

ఇన్నీ తప్పులు తన పాలనలో జరిగాయి కాబట్టే.. జగన్ రెడ్డి తన పర్యటనల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ప్రజలు జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లకుండా బ్యారకేడ్లు, డేరాలు కడుతున్నారు. నిన్న వినుకొండ సభలో జగన్ రెడ్డి తనను తాను సింహంగా పోల్చుకున్నారు. కానీ, కేవలం పిల్లి లాంటి స్వభావం ఉన్న వ్యక్తి మాత్రమే ఇలా ప్రజల నుంచి పారిపోతాడు. పైగా చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాలు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయని జగన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు అంటే ఏమనాలి ?. నిన్న జగన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ గాల్లోకి ఎగరగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే ఓ ముఖ్యమంత్రి ప్రయాణించే ఫ్లయిట్ లో లోపం అంటే ఏమనుకోవాలి ? ఇది కచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే అంటూ వైసీపీ మీడియా ప్రచారం మొదలు పెట్టింది.

టీడీపీ పార్టీకి చెందిన ఎందరో బిజినెస్ జనాలకు, ఎందరో రాజకీయ ఆశ్రితులకు, భయంకరమైన పలుకుబడి వున్న పెద్దలకు, అన్నింటికి మించి ఓ బలమైన కులానికి జగన్ కొరకరాని కొయ్యిగా తయారయ్యారట. అందుకే, జగన్ రెడ్డి పై కుట్ర పన్నారట. పైగా రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఇప్పటికీ మిస్టరీనే అంటూ ప్రచారం చేస్తున్నారు. మరీ అది మిస్టరీనే అయితే, ఇప్పుడు ప్రభుత్వం జగన్ రెడ్డిదే కదా. ఎందుకు జగన్ రెడ్డి ఆ మిస్టరీని ఛేదించడం లేదు. ప్రజల ఆలోచనలను ఏదో రకంగా పక్కదారి పట్టించాలి. అంతే, అంతకు మించి జగన్ రెడ్డికి గానీ, జగన్ మీడియాకి గానీ మరో ఉద్దేశ్యం లేదు. ఆంధ్ర ప్రజల్లారా ఇప్పటికైనా మారండి. లేకపోతే.. తర్వాత మారడానికి కూడా మనం ఉండకపోవచ్చు. జాగ్రత్త.

Recent Articles English

Gallery

Recent Articles Telugu