HomeTelugu Trendingచిరంజీవికి కరోనా

చిరంజీవికి కరోనా

Corona positive for Chiranj
మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా తనకు కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల క్రితం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. నిన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు. అయితే‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో అగర్వాల్ హీరోయిన్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu