HomeTelugu Trendingమెగాస్టార్‌, కొరటాల సినిమా ఎప్పుడంటే.!

మెగాస్టార్‌, కొరటాల సినిమా ఎప్పుడంటే.!

3 16
మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మణిశర్మ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. బ్యాంకాక్ లో మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నాయి. హీరోయిన్ కు కూడా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే మిగిలి ఉంది. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. వచ్చే ఏడాది ఆగష్టు 14 వ తేదీన సినిమాను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవాలయాల బ్యాక్ డ్రాప్ కథతో సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అనేక టైటిల్ ను తెరమీదకు వస్తున్నా.. ఫైనల్ గా ఏ టైటిల్ ను ఫిక్స్ చేశారు అన్నది తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu