HomeTelugu Trendingశరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌: రాధికా

శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌: రాధికా

Corona positive for Sarathk
తమిళ సినీ నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్లు రాధికా శరత్‌కుమార్‌, అలాగే ఆయన కూతురు హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. హైదరాబాదులో ఉన్న శరత్ కు కరోనా సోకింది.

నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అందిస్తుంటానని రాధికా పేర్కొన్నారు. శరత్ కు కరోనా సోకిందనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu